ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితపై (Kalvakuntla Kavitha) కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన సిబిఐ.
కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తాను బదులిచ్చానని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో, మీరు రిమాండ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారని జడ్జి సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటన మరోసారి జరగద్దని హెచ్చరించారు. కాగా ఇది సిబిఐ కస్టడీ కాదు బిజెపి కస్టడీ బయట బిజెపి అడిగిందే లోపల సిబిఐ అడుగుతోంది అని కవిత మీడియాతో వ్యాఖ్యానించడం పట్ల జడ్జ్ సీరియస్ అయ్యారు.