జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం (ఏప్రిల్ 23), బారాముల్లాలోని ఉరి సెక్టార్ సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి భారతదేశంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
ఉగ్రవాదుల నుండి పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. OP టిక్కా, బారాముల్లా 23 ఏప్రిల్ 2025న, బారాముల్లాలోని ఉరి నాలా వద్ద ఉన్న సర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా సుమారు 2-3 మంది UI ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు, చొరబాటుదారులకు హెచ్చరికలు జారీచేసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దానికి జవాబుగా సైన్యం కాల్పులు జరిపారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. బారాముల్లాలోని ఉరి నాలా సమీపంలోని సుర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా భారతదేశంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎదుర్కొంది. బారాముల్లాలో ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా దళాలు తెలిపాయి.