Site icon Telangana Voice News

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు, సమాజానికి కూడా పెను విషాదం

Exit mobile version