Site icon Telangana Voice News

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు

ఇటీవలి పరిణామంలో, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి హర్దీప్ నిజ్జర్ విషయాన్ని ప్రస్తావించారు. ఈసారి ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై జస్టిన్ ట్రూడో, UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్ కాల్లో ఈ విషయం ప్రస్తావించినట్టు సోషల్ మీడియా పోస్ట్‌ చేశారు.

కెనడా ప్రధాని ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్‌లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు. 

ఈ మధ్య అనేక రకాలుగా జస్టిన్ ట్రూడో తన ప్రధానమంత్రి స్థానాన్ని సురక్షితంగా ఉంచుకోవటానికి, అతివాద-ఏర్పాటువాద-భారత వ్యతిరేక సిక్కు ఎంపిల మద్దత్తు కోసం భారత దేశంపై ఇలాంటి కవ్వింపు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నాడు.

ఇలాటి చర్యలతో అనేక మార్లు భారత దేశంతో చివాట్లు తిన్నా కూడా తన పద్దతి ఏ మాత్రం మార్చుకోకుండా, దిగజారుడు తనాన్ని వీడని తన కవ్వింపు చేష్టలతో కెనడా దేశ పరువును తీస్తున్న జస్టిన్ ట్రూడో.

కెనడా దేశాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చుతున్న జస్టిన్ ట్రూడోకు స్వదేశంలోనే కెనడా ప్రజల ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నాడు.

Exit mobile version