Site icon Telangana Voice News

తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ (7.4 magnitude earthquake in Taiwan)

7.4 Magnitude Earthquake in Taiwan

తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది..

తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.

దీంతో తైవాన్‌ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో​ జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింది.

తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు.

Exit mobile version