పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని అందుకే పక్క చూపులు చూస్తున్నారని బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో మట్లాడిన ఆయన జితేందర్ రెడ్డి పార్టీ మారుతున్నాడన్న వార్తలపై స్పందించారు. జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని, అది రాజకీయమా, వ్యక్తిగతమా తనకు తెలియదని, కానీ, జితేందర్ రెడ్డి పార్టీ మారడని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ కి చాలా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకడం లేదని, మేం ధైర్యంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నామని, కానీ వారుపక్క పార్టీల వైపు చూస్తున్నారని, ఇతర పార్టీ ల్లో టికెట్లు దక్కని వాళ్లని తీసుకొవాలని చూస్తున్న ట్లు తెలిపారు. బీజేపీలో కలిసేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారని, వారి పేర్లు చెబితే.. వాళ్లకి మాకు కూడా ఇబ్బంది అవుతుందని అన్నారు. అంతేగాక పార్టీ మరే వాళ్లను తాను అడ్డుకోనని స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై దుష్ప్రచారం చేయ వద్దని, ముస్లింల పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని వారిని ఉసిగొల్పుతున్నారని అన్నారు. కానీ ఇది ఎవరికీ నష్టం చేకూర్చదని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మోదీ మీదనమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్ల మెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిం దని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోదీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకున్నారని తెలిపారు. లిక్కర్ కేసులో రాష్ట్రాని కి చెందిన డబ్బులు ఉన్నాయి.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది.. కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్నించారు. తెలంగాణలో బీజేపీ 12 నుంచి 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు.