Site icon Telangana Voice News

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య

Trains accident in Vizianagaram, AP-Updates

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును వెనక నుండి విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది.  గాయపడిన వారు 50కి పైగా ఉన్నారు.

ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి  అశ్విన్ వైష్ణవ్ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు, మృతి చెందిన వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయలు మరియు 50 వేల రూపాయలు స్వల్ప గాయాలు పాలైన ప్రయాణికులకు ప్రకటించారు. 

హెల్ప్ లైన్ నెంబర్లు : 0891 2746330, 08912744619
ఎయిర్ టెల్ : 81060 53051, 8106053052
బీఎస్ ఎన్ ఎల్ : 8500041670, 8500041671

సారాంశం:

Exit mobile version