Site icon Telangana Voice News

నేపాల్‌లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం

Nepal Earthquake - Featured Image

నేపాల్(Nepal)లో భారీ భూకంపం(earthquake) సంభవించడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం. 128 మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు.మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వాళ్ల సంఖ్యవేలల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో 11 మైళ్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భారతీయ టెక్టోనిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్‌లోకి నెట్టడం వల్ల ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయి. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత రాజధాని న్యూఢిల్లీ వరకు భూ ప్రకంపనలు సంభవించాయి.

నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది.

భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించింది. భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని నేపాల్ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు.

పూర్వం2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 9 వేలమంది మరణించారు. అప్పట్లో అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత ఏడాది నవంబర్ నెలలో జాజర్‌కోట్ సమీపంలోని దోటి జిల్లాలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ఆరుగురు మరణించారు.

ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి.

Exit mobile version