Site icon Telangana Voice News

వరంగల్ సభను విజయవంతం చేయండి

ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరుపుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి పర్యటనలో భాగంగా ఉట్నూర్ ఎక్స్-రోడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పోస్టర్లను ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్‌ఛార్జ్ చైర్మన్ ఆవుడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తోడసం నాగోరావు, సర్పంచ్‌ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్‌దేవ్, పార్టీ మండల అధ్యక్షుడు మెస్రాం హన్మంతరావు, మాజీ సర్పంచ్‌లు రాథోడ్ మధుకర్, రాథోడ్ విష్ణు, మాదవి ముక్తరూప్‌దేవ్, నాయకులు హైమద్, సుల్తాన్ ఖాన్, యశ్వంతరావు, సయ్యద్ ఖాసిం ఉన్నారు.

Exit mobile version