అమెరికా సంస్థ టెస్లా(Tesla) వ్యవస్థాపకుడు మరియు సిఇఓ (CEO) ఎలోన్ మస్క్ (Elon Musk) యొక్క భారత పర్యటన వాయిదా పడింది. ఎలోన్ మస్క్ ఈ నెల అనగా ఏప్రిల్ 21 మరియు 22 తేదీలలో భారత పర్యటించాల్సి ఉంది.
తన ఈ పర్యటనలో భారత ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారిని కలిసి, భారత దేశంలో టెస్లా పెట్టుబడుల విషయంలో చర్చలు జరగవలసి ఉండేది. చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను పని వత్తిడులవల్ల వాయిదా వేసుకోవలసి వచ్చింది.
ఎలోన్ మస్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఎలోన్ మాస్క్, భారత దేశంలో భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తారని అందరూ ఊహించారు. కాని చివరి నిమిషంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
“దురదృష్టవశాత్తు, చాలా భారీ టెస్లా పనుల వల్ల భారతదేశం సందర్శన ఆలస్యం అవుతుంది. కాని ఈ సంవత్సరం భారత దేశాన్ని సందర్శించడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.” అని ఎలోన్ మస్క్ తన X సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా తెలిపారు.