బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది..
ఎమ్మెల్యే గా లాస్యకు కలిసిరాని కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే..
- లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం
- నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవసారి ప్రమాదం
- ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడో సారి గండాన్ని గట్టెక్కలేకపోయిన యువఎమ్మెల్యే
ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది.. కాసేపట్లో పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం.