Site icon Telangana Voice News

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ విడుదల

03-11-2023-Telangana Election Notification

కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల పత్రాలను (Nominations) స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.

ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్‌ 10 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్‌ 13న నామినేషన్లను పరిశీలిస్తారు.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది నవంబర్‌ 15. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. నవంబర్‌ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్‌. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

సారాంశం:

Exit mobile version