Site icon Telangana Voice News

చాయ్​ తాగినంత సమయంలో పనిముగించేస్తాం

ఆపరేషన్​ సింధూర్​ ఇంకా ముగియలేదు.. ట్రైలర్​ మాత్రమే చూపించాం.. ఇంకా సినిమా మిగిలే ఉంది.. పాకిస్థాన్​ సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి చాయ్​ తాగినంత సమయంలోనే పనిముగించేస్తాం జాగ్రత్తా అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ పాకిస్థాన్​ ను హెచ్చరించారు. శుక్రవారం గుజరాత్​ లోని భుజ్​ ఎయిర్​ బేస్​ ను మంత్రి సందర్శించారు. జమ్మూకశ్మీర్​ లో భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయమన్నారు. భద్రతాదళాల మధ్య సమన్వయంతో ఈ ఆపరేషన్​ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పాక్​ గడ్డపై డ్రాగన్​ కుయుక్తులను కూడా తిప్పికొట్టామని మంత్రి చెప్పారు. పాక్​ వద్ద అణ్వాయుధాలుండడం భారత్​ కే కాదు, ప్రపంచదేశాలకు కూడా ముప్పేనని చెప్పారు. కాగితపు దుస్తులు వేసుకున్న పాకిస్థాన్​ అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడడం మానేయాలన్నారు. 

త్రివిధ దళాల శౌర్యం వెర్మిలియన్​ అని చూపించింది. ఇది అలంకారానికి కాదు, ధైర్యానికి చిహ్నాం అని కొనియాడారు. వెర్మిలియన్ అనేది ఉగ్రవాదం నుదిటిపై భారతదేశం గీసిన ప్రమాదపు ఎర్రటి గీత అని అన్నారు. . ఈ పోరాటంలో ప్రభుత్వం, పౌరులందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపారు. తాము శాంతి కోసం మా హృదయాలను తెరిచి ఉంచాం. శాంతికి భంగం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని రాజ్​ నాథ్​ సింగ్​ హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరాటం కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదని, దేశ రక్షణలో ఒక భాగమని అన్నారు. భారత్​ మునుపటిలా లేదన్నారు. శ్రీరామున్ని మార్గాన్ని అనుసరిస్తూ రాక్షసుల్ని నిర్మించే భారత్​ నిరూపించుకుంటున్నామని రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. 

సరిహద్దుల్లో మరోమారు పాక్​ ఉగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. అజార్​ కు రూ. 14 కోట్లు ఇవ్వనుందని చెప్పారు. ఐఎంఎఫ్​ నుంచి తీసుకువచ్చిన డబ్బును ఉగ్ర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగిస్తుందని చెప్పారు. ఐఎంఎఫ్​ పాక్​ కు నిధులు ఇవ్వడం మానేయలని అన్నారు. లేకుంటే ఐఎంఎఫ్​ నిధులను నేరుగా ఉగ్రవాదుల జేబుల్లోకి వెళ్లి సామాన్య ప్రజలపై దాడులకు వినియోగిస్తారని రాజ్​ నాథ్​ సింగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. బ్​రహ్మోస్​ తో పగటిపూటనే పాక్​ కు నక్షత్రాలను చూపెట్టామని ఎద్దెవా చేశారు. ఆర్డీడీవో, ఆకాశ్​, ఇతర రాడార్​ వ్యవస్థలు ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు. భారత వైమానిక దళం పాక్​ లోని ప్రతీమూలకు చేరుకోవడం సామాన్య, చిన్న విషయం ఏమీ కాదన్నారు. సరిహద్దును తాకకుండానే 9 ఉగ్రవాద స్థావరాలను ఎలానాశనం చేశామో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. వైమానిక స్థావరాలు, రాడార్​ సాంకేతికత, యుద్ధ విమానాలను కూడా భారత దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఈ ఆయుధ సంపత్తి భారతదేశ బలాన్ని మరింత పెంచుతుందని రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. 

Exit mobile version