భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు?
ఈ పరిణామాల చిక్కుముళ్లన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాక్ చేతులెత్తేసింది.. తలొగ్గింది.. చైనా డబుల్ గేమ్ కు అమెరికా చెక్ పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయమని పాక్ గ్రహించింది. కాల్పుల విరమణ వెనుక కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు ఇప్పుడు తెరముందుకు వస్తున్నాయి.
పొరబాటైనా.. అప్పుడే బ్రహ్మోస్ శక్తి ప్రపంచానికి తెలిసింది..
పాక్ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర ప్రాంతాలు, దేవాలయాలపై దాడులను తీవ్రంగా పరిగణించింది. అప్పటికే రెండు రోజుల నుంచి హెచ్చరికలను చేస్తున్నా పాక్ పెడచెవిన పెట్టింది. దీంతో భారత్ కు తిక్కరేగింది. బ్రహ్మోస్ మిస్సైల్ కు పని చెప్పింది. ఇంకేం పాక్ కు చెందిన ఎయిర్ బేస్ లపై బ్రహ్మోస్ విరుచుకుపడింది. ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని నాశనం చేసే వరకూ దీన్ని ఆపేవారు ఉండరన్నది జగమెరిగిన సత్యం. 2022 మార్చి 9న భారత్ అంబాల ఎయిర్ బేస్ నుంచి పొరపాటును ఈ మిస్సైల్ ప్రయోగంలో తప్పిదం జరిగింది. నేరుగా 160కి.మీ. దూరంలో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ లోని మియాన్ చన్ను ప్రాంతంలో పడింది. దీంతో పాక్ లో హాహాకారాలు చోటు చేసుకున్నాయి. అసలు ఈ మిస్సైల్ ఒకటి వారి భూభాగంలోకి వచ్చినట్లుగా బ్రహ్మోస్ పేలే వరకూ కూడా వారికి తెలియదు. పేలాక గానీ దీని పవర్ పాక్ కు అర్థం కాలేదు. పాక్ నిఘా వ్యవస్థ, రాడార్లు, సాంకేతిక వ్యవస్థలు బ్రహ్మోస్ ఉల్లంఘనలను గుర్తించలేకపోయాయి. అటుపిమ్మట భారత్ ఇది పొరపాటే అని ఒప్పుకుంది. పాక్ కావాలనే చేశారంది. చైనా దర్యాప్తు కోరింది. అమెరికా పొరపాటు జరిగిందని భారత్ ఒప్పుకుంది కాబట్టి దీనిపై అనుమానాలు, అపోహలు అనవసరమని పేర్కొంది.
ఆర్మీ క్యాంపులే లక్ష్యం.. అమెరికా కాళ్లు పట్టుకున్న పాక్..
సరిగ్గా ఇదే రీతిలో పాక్ లోని నాలుగు ఎయిర్ బేస్ లు, రాడార్లు ధ్వంసం అయ్యాక పాక్ లోని ఐదు ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలోనే అమెరికా నుంచి భారత్ కు ఫోనొచ్చింది. కాల్పుల విరమణ ప్రకటించాలని భారత్ ను కోరింది. భారత్ తన అనుమానాలను నివృత్తి చేసుకొని ఇందుకు అంగీకరించింది. అయితే బ్రహ్మోస్ ను పాక్ కు సాగనంపే సమయంలో ఏం జరిగింది. బ్రహ్మోస్ తో ఎయిర్ బేస్ ల ధ్వంసం తరువాత పాక్ లో వణుకు పుట్టింది. వెంటనే ప్రధాని అధ్యక్షతన త్రివిధ దళాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అమెరికా, యూఎన్, సౌదీ, యూరోపియన్ యూనియన్ దేశాలతో బ్రహ్మోస్ వదలడంపై మొరపెట్టుకొని యుద్ధాన్ని ఆపించండి మహాప్రభో అని ఆయా దేశాలు, ముఖ్యంగా ట్రంప్ కాళ్లా వేళ్లా పడింది. ట్రంప్ ఇందుకు అంగీకరించలేదు. పహల్గామ్ అమాయకుల దాడి, ఉగ్రఫ్యాక్టరీలపై పాక్ తో కొద్దిసేపు చెడుగుడు ఆడాడు. అనంతరం ముందుకు మీరు నేరుగా భారత్ డీజీఎంవోతో మాట్లాడాలని, ఆ తరువాత తాను సంభాషిస్తానని చెప్పారు. వెంటనే పాక్ డీజీఎంఓ సాహిర్ శంషాద్ మీర్జా భారత్ డీజీఎంఓ రాజీవ్ ఘై తో నేరుగా సంభాషించారు. కాల్పుల విరమణ కోరారు. నమ్మకంగా జరిగిన విషయం అంతా చెప్పారు. భారత్ డీజీఎంఓ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అలా జరిగితే ఓకే అని చెప్పారు. ఈ లోపు అమెరికా భారత్ కు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇరుదేశాల మధ్య శాంతి వెల్లివిరియాలని కోరింది. ఇందుకు భారత్ అంగీకరించింది. వెంటనే విలేఖరుల సమావేశంలో కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో వెంటనే మరోమారు పాక్ ట్రంప్ కు ఫోన్ చేసి రక్షించావు దేవుడా అని మొరపెట్టుకొని ఆకాశానికెత్తేసింది. మీడియా ప్రకటనలో కూడా మాటిమాటికి ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపింది.
చైనా ఆటంకాలు..కాల్పుల ఉల్లంఘన ఎందుకు జరిగింది..
పాక్ కు వెంటనే చైనా ఫోన్ చేసింది. తాము మీ ప్రాంతంలో ఇంతపెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టామని, ఆయుధాలను అందించామని, ఆ ప్రాజెక్టుల్లో తమ జాతీయులు అనేకమంది ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఇంతచేసినా యుద్ధ విరమణకు ట్రంప్ కు కృతజ్ఞతలు ఎలా చెబుతారని నిలదీసింది. వెంటనే కాల్పులను ప్రారంభించాలని తాము వెంటే ఉన్నామని రెచ్చగొట్టింది. అదే సమయంలో ఓ అరగంట, గంటపాటు ఆగిన కాల్పులు కాస్త మళ్లీ పాక్ మొదలుపెట్టింది. ఆసియా దేశంలో తామే పెద్దన్న అని ఏదైనా చూసుకుందామని చైనా బీరాలుపోతూ పాక్ ను కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రోత్సహించింది.
తెరవెనుక తతంగం..
పాక్ ఉల్లంఘనలను భారత్ తిప్పికొడుతూనే మరోవైపు తాము విరమణ ఉల్లంఘనలకు సిద్ధమేనని ప్రకటించింది. ఈ లోపు ఇటు భారత్ నుంచి అమెరికాకు ఈ సమాచారం మొత్తం అందింది. అటుపిమ్మట ట్రంప్ ఫోన్ చేసి ఇటు పాక్ ను, అటు చైనాను గట్టిగానే తలంటారు. దీంతో పాక్ వెనక్కు తగ్గింది. తెరవెనుక జరిగిన తతంగం.
Leave a Reply