Site icon Telangana Voice News

టీ.ఎస్.పీ.ఎస్.సి.కి రూ.40 కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కమిషన్ కార్యాలయ నిర్వహణ, పరీక్షల ఏర్పాటుకు కావాల్సిన రూ.40 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది ఆఖరులోపు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Exit mobile version