అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డను స్వాగతించారు. ఫిబ్రవరి 15 న తమకు పుత్ర సంతానం కలిగినట్టు ఈ జంట ప్రకటించారు. అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో బాలుడికి “అకా” అని పేరు పెట్టారని వెల్లడించారు.
“ఎంతో ఆనందంతో మరియు హృదయపూరిత ప్రేమతో, ఫిబ్రవరి 15 న, మేము మా పసికందు ‘అకే’ మరియు వామికా యొక్క చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాము!” అని అనుష్క, విరాట్ ప్రకటించారు.
“మా జీవితంలో ఈ అందమైన సమయంలో మేము మీ ఆశీర్వాదాలను మరియు శుభాకాంక్షలు కోరుకుంటాము. ఈ సమయంలో దయతో మా ప్రైవసీని గౌరవించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము”అని వారు తెలిపారు.
అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ దంపతులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.