Site icon Telangana Voice News

Hari Hara Veera Mallu Release Date Confirmed

పవన్‌ కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల‌లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒక‌టి.

పిరియ‌డిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు రూల్స్ రంజన్ (Rules Ranjan) ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

ఈ సినిమాను మే 09 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మూవీకి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ మూవీ పోస్ట్ ప్రోడక్ష‌న్ ప‌నులు వేగంగా జరుగుతున్నాయి.

రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డ‌బ్బింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. మే 09 మాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ‌రుపం చూడ‌డానికి సిద్ధంగా ఉండ‌డంటూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Exit mobile version