సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 12 ( హనుమాన్ జయంతి) న లోకమాత అహిల్యా బాయి 300 వ జయంతి సందర్భంగా TTC భవన్ లో జరిగిన కుటుంబ సమ్మేళనం అందరికీ స్ఫూర్తి నిచ్చింది.
సాయంత్రం 6.30 లకు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా, భజన, పద్య,శ్లోక పఠనం,తెలుగు మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, భగవద్గీత శ్లోకాలను చదివి వినిపించారు.
యోగ కార్యక్రమం, అహిల్యబాయి హోల్కర్ ఏక పాత్ర నిర్వహించారు.
అహిల్యా బాయి హోల్కర్ కథ చెప్పి,దాని ఆధారంగా క్విజ్ పోటీ నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు డా అరవింద్ గారు కుటుంబ సభ్యులు అప్పుడుప్పుడు కలుస్తూ ఉండాలని పేర్కొన్నారు.
మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ శ్రీమతి అహిల్యా బాయి హోల్కర్ జీవిత ఘట్టాలు వివరించింది.
” * మహారాష్ట్ర లో చౌండి అను గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించి,అమ్మా నాన్నల నుండి వినయ విధేయతలు నేర్చింది.
- 12 ఏళ్ల వయస్సులో ఇండోర్ రాజ్య సుబేదార్ మలహార్ రావ్ కుమారుడు ఖండే రావ్ తో వివాహం జరిగి,బాల్యం లోనే రాజభవనంలోకి ప్రవేశ్నించినా కూడా అణు మాత్రం అహంభావం చూపలేదు.
- మామ నేర్పిన గణితం,గుర్రపు స్వారీ,కత్తి సాములో ప్రావీణ్యత సాధించింది.
- ఇండోర్ రాజ్య ఆదాయ వ్యయాల లెక్కలు చూసి,రాజనీతి శాస్త్రం అర్థం చేసుకుని, ఇండోర్ రాణి గా ప్రసిద్ధికెక్కింది.
- తన రాజ్యం యొక్క రాజధానిని నర్మదా నదీ తీరాన వున్న మహేశ్వర్ పట్టణంకి మార్చి,ఆ నగరాన్ని సుందరంగా,అన్ని హంగులతో తీర్చి దిద్దింది.
రైతులు పండించిన పంటలకు ఆదాయం కల్పించింది.- చేనేత కార్మికులు తయారు చేసిన చీరలకు వాణిజ్య రంగంలో గిరాకీ కల్పించింది.
- 50 మంది మహిళలను సైన్యంలో చేర్చుకుంది.
- ఫిరంగి తయారీల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
- వితంతు వులకు ఉపాధి కల్పించింది.
- బద్రీనాథ్ మొదలు రామేశ్వరం వరకు మొఘలుల క్రూరత్వానికి ధ్వంసమైన మందిరాలను పునర్ నిర్మించింది.
- ఇంట్లో 15 కి పైగా కుటుంబ సభ్యులు వివిధ కారణాలతో మరణించగా, గుండె నిబ్బరంతో బాధను దిగమ్రింగి,ప్రజలనే కన్న బిడ్డలుగా భావించి, ప్రేమించి, సుపరి పాలన సాగించి, సమరసత, ధైర్యం,విశ్వాసంతో,రాజ్య పాలన కొనసాగించి తన పేరును చరిత్ర పుటలల్లో చిరస్థాయిగా నిలిపిన దీరోదాత్తత కలిగిన మహిళా మూర్తి ఈమె.
- స్వాభిమానం స్వావలంబన తో పాటు మహిళా సాధికారతకి నిలువుటద్దం లోక మాత అహిల్యబాయ్ పాలన ” యని శ్రీమతి రుక్మిణి గారు వివరించారు.
రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ తన ప్రసంగంలో కుటుంబ ప్రాధాన్యత గురించి వివరించారు.
- పాశ్చాత్య దేశాలు మహిళలను చిన్నచూపు చూసి ఓటు హక్కు కూడా కల్పించక,కేవలం భోగ వస్తువుగా చూసినందువల్లనే అమెరికా లో బెట్టి ఫ్రేడెన్ అను వనిత 25 సంవత్సరాల పాటు పురుషులకు వ్యతిరేకంగా ఉద్యమించిన కారణంగా, కుటుంబ విలువలను కోల్పోయి, సమాజం అశాంతికి గురైంది.
- భారత్ లో వివాహం వెనక నున్న గొప్పదనం, భార్యాభర్తల మధ్య నున్న ప్రేమ అనురాగాలు, రానున్న తరాల వారికి ఉత్తమ సంబంధాలు అందించడానికి ప్రేరణగా నిలిచాయి.
- కుటుంబం కేవలం వ్యక్తుల అవసరాలు తీర్చేది కాకుండా సమాజ వికాసానికి దోహద పడేదిగా ఉంటుంది.
- సీతా రాముల కళ్యాణం, ఏక పత్ని వ్రత పాలన,తండ్రి మాట జవదాటకుండా కుటుంబ సభ్యులు పరస్పరం కలిసి మెలిసి ఉండటం ఒక ఉదాహరణంగా నిలుస్తుంది.
- ద్రౌపది 5 గురు భర్తల అభిప్రాయాలతో కలిసి పోయి ఏక త్రాటి పై నడిచిన సంఘటన వింటే పరస్పర ఆశ్రీతమైన కుటుంబాలు నిలదొక్కుకుంటాయి.
- సినిమా కథలు,టివి సీరియల్స్ డైలాగ్ లు మన కుటుంబ వ్యవస్థ లో జోక్యం చేసుకుని, మన మధ్య నున్న సంబంధాలను దెబ్బ తీస్తూ,కుట్రలకు తెర లేపుతున్నాయి.
- మన పిల్లల వికాసానికి ఎక్కువ సమయం ఇవ్వటం,ఆచార సంప్రదాయాల వెనక నున్న శాస్త్రీయతని అర్థం చేసుకోవాలి.
- కులం అనే పరిధి నుండి మనమంతా హిందువులుగా భావించుకుని, ఐక్యత తో జీవించాలి.మన ఆడ పిల్లల ను లక్ష్యం చేసుకుని ఇతర మతాలు వేస్తున్న వలలో పడకుండా మన పిల్లలను రక్షించుకోవాలి.
- మగ పిల్లల్లో స్త్రీల పట్ల గౌరవం నిర్మాణం చెయ్యాలి.
- కేవలం డబ్బు సౌకర్యాల హోరులో పడిపోయి అమ్మా నాన్నలను తాత నానమ్మలను అలాగే మన సంతానాన్ని దూరం చేసుకుని కుటుంబాలు విచ్చిన్నం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిదీ “. అని అప్పాల ప్రసాద్ జీ వివరించి చెప్పారు.
- కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసిన కారణంగా సుమారు 700 మంది ( 200 స్త్రీలు+ 400 పురుషులు+100 పిల్లలు)పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి బల్ల సంతోష్,ఉపాధ్యక్షులు విజయ భాస్కర్,రాజ శేఖర్ రెడ్డి,కార్యదర్శులు బాలయ్య, మాట్ల సుమన్,కన్వీనర్ మాలే రమేష్,తపస్ సభ్యులు రఘువర్ధన్ రెడ్డి,శ్రీకాంత్,మధుసూదన్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,వేణు మాధవ్,బాలకృష్ణ రెడ్డి,నరేష్, ఉమాశంకర్, వెన్నెల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.