పాక్ వైపు నుంచి బుల్లెట్ పేలితే (దూసుకొస్తే).. భారత్ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు పాల్గొన్నారు.
జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తాం..
కాగా ప్రధానమంత్రి సమావేశంలో కీలకమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాదంపై ఒకటే విధానమన్నారు. జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తామన్నారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడేదే లేదన్నారు. పీవోకేను ముందుగా, మర్యాదగా భారత్ కిచ్చేయాలన్నారు. పాక్ కబ్జా చేసింది నిజం కాదా అని నిలదీశారు. భారత్–పాక్ చర్చల్లో మూడోదేశ మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. పాక్ ఏదైనా దుందుడుకు చర్యలకు దిగితే మరోమారు సమాధానం ఇంతకంటే కఠినంగానే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు.
స్వీయరక్షణ కాదు.. ఎదురుదాడే..
భారత్ ఇప్పుడు స్వీయ రక్షణ విధానాన్ని గాకుండా ఎదురుదాడి (దూకుడు) విధానానికి దిగుతుందని స్పష్టం చేశారు. పాత పద్ధతులు, విధానాలు, ఒప్పందాలు ఇకపై చెల్లవన్నారు. ఇదే అంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కూడా చెప్పినట్లు సమాచారం. ఓవైపు కాల్పుల విరమణ ప్రకటించాక తిరిగి పాక్ దాడులు చేయడం వెనుక ఆ దేశం దుర్భుద్ధి, దుర్నితీ, ఉగ్రభావజాలాన్ని తెలియజేస్తుందన్నారు. ఇక వీటన్నింటినీ సహించేశక్తి, ఓపిక భారత్ కు, ప్రజలకు లేవన్నారు. చర్యకు బదులుగా ప్రతీచర్య విధానాన్నే అనుసరిస్తామని కుండబద్ధలు కొట్టారు.
పీవోకే ఇవ్వకుంటే రాజీ సాధ్యం కాదు..
పీవోకే విషయం సమస్య పరిష్కారం కాకుంటే ఎటువంటి సంభాషణలు, సయోధ్య, రాజీ సాధ్యం కాదన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదానికి, ప్రోత్సహిస్తున్న దేశానికి బలమైన సందేశాన్నిచ్చామని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తమదేశంపై ఉసిగొలిపే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని మోదీ స్పష్టం చేశారు.
Leave a Reply