Site icon Telangana Voice News

ఓదెల 2

తమన్నా ప్రధాన పాత్రధారణిగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి ఇది సీక్వెల్‌. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి.మధు మీడియాతో ముచ్చటించారు.

నేను సంపత్‌ నందికి తెలియకుండానే ‘ఓదెల’ ఫస్ట్‌ పార్ట్‌ చూశాను. సినిమా చూసి చాలా ఎక్సైట్‌ అయ్యాను. అనుకోకుండా ఆయనే ‘ఓదెల2’ కథని నాతో చెప్పారు. కంటెంట్‌ బాగా నచ్చి, ఈ ప్రాజెక్ట్‌ చేశాను. పైగా తనతో నాకు మంచి వేవ్‌ లెంత్‌ కుదిరింది. భవిష్యత్తులో ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని ఉంది.

ఇందులో నాగ సాధుగా తమన్నా అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. ఫస్ట్‌ లుక్‌తోనే ఆ క్యారెక్టర్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ కథ విషయంలో తమన్నా చాలా ఎగ్జైట్‌ అయ్యారు. చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. కరెక్ట్‌ టైంలో, కరెక్ట్‌ కథ ఆమె దగ్గరకు వెళ్లిందని నేను నమ్ముతున్నాను.

ఈ సినిమా కథ లాజికల్‌గా ఉంటుంది. ప్రతి దానికి ఒక ఆధారంతోనే చూపించాం. ఇందులో చాలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడియన్స్‌ని చాలా సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అజినీస్‌ లోక్‌నాథ్‌ ఈ జోనర్‌కి పర్ఫెక్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. చాలా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌెండ్‌ స్కోరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే సినిమాటోగ్రాఫర్‌ సౌందర్‌ రాజన్‌ విజువల్స్‌తో మంచి ట్రీట్‌ ఇచ్చారు.

ఈ కథలో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. వశిష్ట క్యారెక్టర్‌ కూడా చాలా బాగుంటుంది. తమన్నా, వశిష్ట.. ఈ రెండు క్యారెక్టర్స్‌ మధ్య టగ్‌ అఫ్‌ వార్‌లా ఉంటుంది. అలాగే మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, హెబ్బా..ఈ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులు పాత్రలతో లీనం అవుతారు.

ఇందులో గ్రాఫిక్స్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంది. పంచభూతాల కాన్సెప్ట్‌ని గ్రాఫిక్స్‌లో చూపించాం. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలి, ఒక మంచి సక్సెస్‌ని అందుకోవాలని ప్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం.

Exit mobile version