Site icon Telangana Voice News

నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)

Sculpture of Jain Tirthankar Parswanath found in Nemile

యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి సమీపగ్రామం ‘నెమిల’ ప్రసిద్ధ చారిత్రక గ్రామం. ఈ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ జైనధర్మానికి చెందిన 23వ జైనతీర్థంకరుడు పార్శ్వనాథుని (Jain Tirthankar Parshwanath) విగ్రహశకలాన్ని గుర్తించాడు.

22వ జైనతీర్థంకరుడైన ‘నేమినాథుని’ పేరుమీదుగానే వెలసిన గ్రామం నెమిల. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జైన బసదులతో అలరారేదని కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం, కొల్లూరు గ్రామాలలో లభించిన జైనతీర్థంకరుల శిల్పాలే సాక్ష్యాలు.

నెమిలలో దొరికిన పార్శ్వనాథుని శిల్పంవల్ల ఇక్కడ జైనబసది వుండేదని చెప్పవచ్చు. ఈ విగ్రహం కాయోత్సర్గభంగిమలో ఉంది. ఆజానుబాహుడైన పార్శ్వనాథుని వెనక చుట్టలు తిరిగిన ఏడుతలల సర్పం ఉన్న ఆనవాళ్ళు మిగిలి కనిపిస్తున్నాయి.

ఈ శిల్పం రాష్ట్రకూటశైలిలో చెక్కబడింది. రాష్ట్రకూటపాలకులు అమోఘవర్షుడు, 2వ కృష్ణుడు కొలనుపాక రాజధానిగా పాలించినపుడు వారు జైనధర్మ అవలంబకులు కనుక విరివిగా ఈ ప్రాంతంలో జైనబసదులు నిర్మించారు.

Exit mobile version