భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting)
ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు బీసీ వాదం బలంగా వినిపిస్తుండగా.. మరో వైపు అధికార పార్టీలో ఉన్న ఏకైక బీసీ సామాజికవర్గ నేతకు ప్రోటోకాల్ మర్యాదను విస్మరించడం సరికాదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని పార్టీ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.
Leave a Reply