Hostage Situation in Germany

జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో బందీలు – డజనుకు పైగా విమానాలు దారి మళ్లింపు

జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో రాత్రి 8 గంటల సమయంలో ఒక సాయుధుడు తన కారును భద్రతా ప్రాంతం గుండా టార్మాక్‌పైకి దూసుకెళ్ళి కనీసం ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్నారితో సహా బందీలుగా ఉంచుకునాడు.

Two people, including a child, held hostage at Germany’s Hamburg airport – more than a dozen flights diverted

శనివారం సాయంత్రం హాంబర్గ్‌లో దిగాల్సిన 17 విమానాలను దారి మళ్లించారు. మరో 286 విమానాలు ఆదివారం షెడ్యూల్ చేయబడ్డాయి, ఇందులో 34,500 మంది ప్రయాణికులు ఉన్నారు.

హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఆగిపోయింది మరియు చిన్నారి కస్టడీపై వివాదం కారణంగా “బందీ పరిస్థితి” తలెత్తినట్టు తెలుస్తుంది. శనివారం రాత్రి టెర్మినల్స్ ఖాళీ చేయబడ్డాయి, పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో ఒక సాయుధుడు తన కారును భద్రతా ప్రాంతం గుండా టార్మాక్‌పైకి దూసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. గాలిలో రెండు షాట్‌లు కాల్చడం మరియు వాహనం నుండి రెండు కాలుతున్న బాటిళ్లను ఎగరవేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

విమాన కార్యకలాపాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి. రోజంతా విమానాల రద్దు, ఆలస్యాలు ఉంటాయి. ప్రయాణికులు ప్రస్తుతానికి విమానాశ్రయానికి వెళ్లవద్దని పోలీసులు కోరుతున్నారు

పోలీసు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కనీసం ఇద్దరు వ్యక్తులు – ఒక చిన్నారితో సహా – కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ భార్య తన బిడ్డ అపహరణపై పోలీసులను అప్రమత్తం చేస్తూ అత్యవసర కాల్ చేసిందని ప్రతినిధి తెలిపారు.

“మేము పెద్ద సంఖ్యలో అత్యవసర సేవలతో ఉన్నాము. మేము ప్రస్తుతం బందీ పరిస్థితిని నియంత్రణలోనే ఉందని” హాంబర్గ్ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లోని ఆప్రాన్ ప్రాంతంలో కారు పార్క్ చేసి ఉంది. సైకాలజిస్టులు అలాగే చర్చలలో నైపుణ్యం కలిగిన అధికారులు సైట్‌లో ఉన్నారని, వారు వాహనంలో ఉన్న వ్యక్తితో సంప్రదింపులు చేస్స్తున్నారని పోలీసులు తెలిపారు.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *