Tag: tirthankar
-
నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)
యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి సమీపగ్రామం ‘నెమిల’ ప్రసిద్ధ చారిత్రక గ్రామం. ఈ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ జైనధర్మానికి చెందిన 23వ జైనతీర్థంకరుడు పార్శ్వనాథుని (Jain Tirthankar Parshwanath) విగ్రహశకలాన్ని గుర్తించాడు. 22వ జైనతీర్థంకరుడైన ‘నేమినాథుని’ పేరుమీదుగానే వెలసిన గ్రామం నెమిల. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జైన బసదులతో అలరారేదని కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం, కొల్లూరు గ్రామాలలో లభించిన జైనతీర్థంకరుల శిల్పాలే సాక్ష్యాలు. నెమిలలో దొరికిన పార్శ్వనాథుని శిల్పంవల్ల…