Tag: Telangana news
-
త్రిబుల్ ఆర్ పనులను వేగవంతం చేయాలి : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో మెట్రో విస్తరణపై సీఎం సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు…