సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం ఎలా మాయమైంది

మేడారంలోని సమ్మక్క గద్దె వద్ద భారీ రావి వృక్షం ఉండేది. ఎత్తైన ఈ వృక్షం సమ్మక్క గద్దె ను ఆనుకొని ఉండడంతో చల్లటి నీడ ఇచ్చేది. 2012 వరకు కూడా ఉండే ఈ రావి చెట్టు, దీనినే రేలా చెట్టుగా స్థానికంగా పిలిచేవారు.

అయితే,, సమ్మక్క సారలమ్మలు గద్దెలపై వచ్చిన మరుసటి రోజు, జాతర మూడో రోజు, ఈ రావి చెట్టుపై ఒక నాగుపాము ప్రత్యక్షమై, కొద్ది సేపటితర్వాత మాయం అయిపోయేదని స్థానిక ఆదివాసీలు చెప్పేవారు.

అయితే, సమ్మక్క, సారలమ్మ ల దర్శనానికి వచ్చే భక్తులు ఈ రావి చెట్టు బెరడు, కొమ్మలు అమ్మవార్ల మహిమ కలిగి ఉంటాయనే నమ్మకంతో, బెరడును, కొమ్మలను తెంపుకొని తీసుకెళ్లడం ప్రారంభించారు. క్రమక్రమంగా పూర్తిగా చెట్టు బెరడు పోవడంతో ఆ రావిచెట్టు నిలువునా ఎండి పోయింది.

ఈ వృక్షాన్ని పరిరక్షించడానికి చెట్టు మొదలు చుట్టూ ఇనుప జాలీలు , ఫెన్సింగ్ వేసినప్పటికీ లక్షల్లో వచ్చే భక్తులు బెరడును, కొమ్మలను తొలిచితీసుకెళ్లడంతో ఆ చెట్టు నిలువునా ఎండి పోయింది.

తిరిగి, ఇటీవల ఇదే ప్రాంతంలో మరో రావి చెట్టును నాటి దాని రక్షణకు మేడారం ట్రస్ట్ బోర్డు తగు రక్షణ చర్యలు చేపట్టింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *