దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ సేవలు (Digital transactions) దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి.
డౌన్‌డిటెక్టర్ (DownDetector) ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్వర్క్ స్లో అని, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో సమస్యల గురించి 222 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యూపీఐపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంకా స్పందించలేదు. కాగా, మూడు వారాల్లో ఇలా యూపీఐలో సమస్యలు తలెత్తడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Leave a Reply