Trains accident in Vizianagaram, AP

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును, విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలు, వెనుక నుండి ఢీకొనడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, కంటకాపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు, మృతి చెందిన వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయలు మరియు 50 వేల రూపాయలు స్వల్ప గాయాలు పాలైన ప్రయాణికులకు ప్రకటించారు. 

ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ కూడా ఇప్పటికే స్పెషల్ ట్రైన్ ద్వారా అక్కడ చేరుకున్నారు. National Disaster Response Force (NDRF) సహాయం కూడా తీసుకుంటున్నారు. 

విజయనగరానికి చెందిన స్థానిక పోలీసు,  రెవెన్యూ, వివిధ శాఖలతో పాటు సమన్వయం చేసుకుంటూ శతక శతకంగాత్రులను క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఒక ట్రైన్ ఆ ట్రాక్ మీద వెళ్తున్న సందర్భంలో మరొక ట్రైన్ వచ్చి గుద్దడం అన్నది తరచూ జరుగుతున్నాయి. 

గతం ఎప్పుడు జరగని ప్రమాదాలు ఇవి. ఇట్లాంటి ప్రమాదాలు సాధారణంగా పట్టాలు తప్పడం జగుతుంది, కానీ ఇట్లా రైళ్లు ఒకదానికి ఒకటి గుద్దుకోవడం లాంటి సంఘటనలు విపరీతంగా పెరుగుతుండడంతో రైల్ ప్రమాదాల మీద ఆందోళన కలుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.

ఆటో సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఇటీవల కాలంలో అనేక రకాల ఆధునికరణ పనులు రైల్వే శాఖ చేపడుతున్నారు. ఆ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రక్రియ చేస్తున్నారు. కానీ అవి ఏ మాత్రం ఫలితాలు ఇస్తున్నట్టు మనకు కనిపించడం లేదు.

ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు  ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా,  ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే జరుగుతున్నాయన్న అనుమానాలు అనేకులు అభిప్రాయపడుతున్నారు.

పూర్వం షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మరువకముందే ఇలాంటి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 

ఈ సంఘటనపై పూర్తివిచారణ జరగాల్సి ఉంది. జరిగితే గాని ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేక రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సిఉంది.

హెల్ప్ లైన్ నెంబర్లు :
0891 2746330, 08912744619
ఎయిర్ టెల్ : 81060 53051, 8106053052
బీఎస్ ఎన్ ఎల్ : 8500041670, 8500041671

సారాంశం:

  • విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును ఢీకొన్న విశాఖ-రాయగడ రైలు
  • ప్రమాదంలో పట్టాలు తప్పిన మూడు భోగీలు
  • ఎనిమిది ప్రయాణికుల మృతి, పలువురికి తీవ్ర గాయాలు
  • మృతి చెందిన వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా.
  • తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయలు
  • 50 వేల రూపాయలు స్వల్ప గాయాలు పాలైన ప్రయాణికులకు