Welcome to Telangana Voice News
-
చాయ్ తాగినంత సమయంలో పనిముగించేస్తాం
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు.. ట్రైలర్ మాత్రమే చూపించాం.. ఇంకా సినిమా మిగిలే ఉంది.. పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి చాయ్ తాగినంత సమయంలోనే పనిముగించేస్తాం జాగ్రత్తా అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. శుక్రవారం గుజరాత్ లోని భుజ్ ఎయిర్ బేస్ ను మంత్రి సందర్శించారు. జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయమన్నారు. భద్రతాదళాల మధ్య…
-
టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. థాంక్యూ కోహ్లీ అంటూ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది. భారత క్రికెట్ టెస్ట్ చరిత్రలో ఓ శకం ముగిసిందని, టీమ్ ఇండియాకు కోహ్లీ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంది. “విరాట్ కోహ్లీ 2011 జూన్ 20న కింగ్స్టన్ లో వెస్టిండీస్‌తో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని 2012…
-
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్ బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల…
-
ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు
పహల్గామ్ దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ లోని పౌర సమాజానికి నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అదే సమయంలో పాక్ సరిహద్దులోని భారత పౌరులను, దేవాలయాలను, ప్రార్థనాలయాలను టార్గెట్ చేసుకుందని చెప్పారు. తాము యుద్ధనీతిని ప్రదర్శించామని, పాక్ ఈ నీతిని విస్మరించిందన్నారు. దీంతో పాక్ లోని…
-
బుల్లెట్ పేలిస్తే.. బాంబు పేలుస్తాం
పాక్ వైపు నుంచి బుల్లెట్ పేలితే (దూసుకొస్తే).. భారత్ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు పాల్గొన్నారు. జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…
-
అసలేం జరిగింది ?
భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఈ పరిణామాల చిక్కుముళ్లన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాక్ చేతులెత్తేసింది.. తలొగ్గింది.. చైనా డబుల్ గేమ్ కు అమెరికా చెక్ పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయమని పాక్ గ్రహించింది. కాల్పుల విరమణ వెనుక కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు ఇప్పుడు తెరముందుకు వస్తున్నాయి. పొరబాటైనా.. అప్పుడే బ్రహ్మోస్ శక్తి ప్రపంచానికి తెలిసింది..పాక్ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర…
-
మారుతి ఇ-విటారా: క్రెటా EV షోరూమ్‌లను తాకింది
మారుతి e-Vitara: మారుతి సుజుకి దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గ్రాండ్ విటారా యొక్క ఎలక్ట్రిక్ అవతార్. దీనికి e-Vitara అని పేరు పెట్టారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ కారు దేశంలోని వివిధ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. మారుతి త్వరలో దాని లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUVని చాలా చోట్ల నెక్సా షోరూమ్‌లలో ప్రదర్శించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ SUV…
-
మెగా ప్రాజెక్ట్ పై నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఈ సినిమాను దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తారని, నాని నిర్మిస్తారని తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది? ఈ సినిమా నుండి ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, హిట్3 ప్రమోషన్ల సందర్భంగా నాని ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. చిరంజీవి-శ్రీకాంత్ సినిమా ప్యారడైజ్ దాని తర్వాత వస్తుందని, ఈ…
-
విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకులలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి రెండవ స్థానంలో ఉన్నాడు. రాజమౌళి వరుసగా 12 విజయాలు సాధించడం గమనార్హం, అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఎనిమిది విజయాలు సాధించడం ద్వారా తనదైన రీతిలో తన విలువను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా రీసెట్ ముహూర్తం జరుపుకుంది మరియు త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. దీనితో ఆయన మరోసారి పెద్ద విజయాన్ని…
-
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం
ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించిన అధికారులు వివిధ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి తెలంగాణలో రూ.12,062 కోట్లు పెట్టుబడి…
Got any book recommendations?