గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నారు.. భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. భాషను జాగ్రత్తగా వాడాలి అని సూచించారు వెంకయ్య నాయుడు.. ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం.. చదువు, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి.. కానీ, ఉచితపథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అన్నారు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల సమయం ఆదా, ఖర్చు ఆదా అవుతుందన్నారు.. ఎన్నికల ఖర్చు వేలకోట్లుకు చేరింది.. నేను ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ప్రజలు విరాళంగా కొంత డబ్బులు ఇచ్చారు.. నేను రూపాయల జేబులో నుండి తీయలేదు.. ఒక్క రూపాయి జేబులో వేసుకోలేదని గుర్తుచేసుకున్నారు.. రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాలి.. కానీ, కులం, డబ్బులు, క్రిమినల్స్ కి ఇప్పుడున్న పార్టీలు ప్రధాన్యత ఇస్తున్నాయన్నారు.

వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం
by
Tags:
Leave a Reply