తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు 11 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వంలో తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
అయితే నాడు జరిగిన పేపర్ లీకేజీల సమస్య వల్ల తొలిసారి Group-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం జరిగింది.
11 జూన్ 2023న నిర్వహించిన రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష, OMR పరీక్ష పత్రాలలో లెక్కలో తేడాలు, అభ్యర్థుల నుండి వేలిముద్రలు తీసుకోకపోవడం లాంటి సంఘటనల ద్వారా రెండోసారి హైకోర్టు సూచనల మేరకు ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు చేయడం జరిగింది.
ఎన్నికల హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 563 ఉద్యోగాలతో త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిరుద్యోగులు కోరుకున్న విధంగానే బోర్డు ప్రక్షాళన చేసి, ఇటీవలే నూతన చైర్మన్గా మాజీ డిజిపి కే. మహేందర్ రెడ్డిని నియమించడం జరిగింది.
ఉద్యోగాల భర్తీలో వేగం పెరిగిందని చెప్పవచ్చు. యూనిఫాం ఉద్యోగాలలో వయస్సు నిబంధనలు సడలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ అన్న విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగియాలని తెలంగాణ నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
Leave a Reply