టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు మళ్ళీ రద్దు – హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

తెలంగాణలో జూన్ 11న  నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ ఇటీవల దాఖలైంది.

 ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈరోజు కీలక ఆదేశాలను జారీ చేసింది.

 అక్టోబర్ 16న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి లీకేజీ వ్యవహారం బయటపడగా, వాటిని రద్దు చేసింది.

జూన్ 11న టీఎస్‌పీఎస్సీ రెండోసారి గ్రూప్-1 పరీక్షను నిర్వహించాల్సిందిగా.. ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదని, అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

అభ్యర్థుల వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు, దీనిపై తుది తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది.

నేడు తాజాగా దీనికి సంబంధించి హైకోర్టు, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది 

గ్రూప్-1 పరీక్షను మళ్లీ పగడ్బందీగా నిర్వహించాలని, హైకోర్టు టీఎస్‌పీఎస్సీను ఆదేశించిం


by