high court - Srinivas Goud

శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని, శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు నిమిత్తం హైకోర్టు విచారణలో భాగంగా అడ్వకేట్ కమీషన్‌ను నియమించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్‌ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవడంతో, నిన్ననే ఇవ్వాల్సిన తీర్పు ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది.

ఈ రోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.


Posted

in

, ,

by