తెలంగాణ బిఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు వేసిన హైకోర్టు  పిటిషన్ పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది.

 2018లో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్  సమర్పించిన ఎన్నికల ఫిడమిట్లో తన ఆస్తులు అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని హైకోర్టులో రాఘవేంద్ర రాజు పిటిషన్ వేశారు.  

ఈ వివాదం చుట్టూ అనేక ఇతర సంఘటనలు చాలా రోజులుగా చోటు చేసుకున్నాయి.

ఎన్నికలప్పుడు ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి, మళ్లీ వెనక్కు తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర రాజు న్యాయస్థానాన్ని కోరారు.


Posted

in

, ,

by