స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్త నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఈరోజు హుజురాబాద్ లో YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా హుజురాబాద్ డిపో క్రాస్ నుంచి హుజురాబాద్ పుర వీధులగుండా వివేకానంద విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ ర్యాలీని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రెడ్డి గత 10ఏళ్లు సామాజిక రంగంలో పని చేసిన అనుభవంతో యువ యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం సంతోషం అని, భవిష్యత్ లో మంచి కార్యక్రమాలు చేయాలని అభినందించారు.
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతలో దేశభక్తిని నింపేలా, వ్యక్తిత్వ వికాసం కోసం సెమినార్లు,స్కిల్ డెవలప్ మెంట్ కోసం కార్యక్రమాలు,రక్తదాన శిబిరాలు అదే విధంగా,నేటి సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేలా యువ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమాజం కోసం పని చేస్తుందని,భవిష్యత్ లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి తెలిపారు.జనవరి 23 నేతాజీ సుభాస్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా యువ రాష్ట్ర కమిటీ వేయనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువ ప్రతినిధులు నరెడ్ల చైతన్య రెడ్డి,దేవ గౌడ్,రాజ్ కమల్, నరేష్,రామకృష్ణ,ప్రణీత్,చిరంజీవి,మధు పటేల్,శ్రావణ్,తరుణ్ తేజ,ప్రదీప్,అజయ్,కొండాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply