Category: Districts
-
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం
ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి గారు మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర…
-
అక్రమంగా జనావాసాల మద్యం షాప్ వెంటనే తొలగించాలి-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
గుడికి, బడికి దూరంలో మద్యం షాపులు ఉండాలని నూతన మద్యం పాలసీలో ఉన్నప్పటికీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బోడుప్పల్ నగర కార్పొరేషన్ పరిధిలో “సింధూర లిక్కర్ మార్ట్ వైన్స్” నిర్వాహకులు చట్టాలను చుట్టాలుగా మార్చుకుని స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ కాలనీవాసులు, మహిళలు, విద్యార్థులు, పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు, ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, సమాజంలో నేడు జరుగుతున్న అసాంఘిక చర్యలకు…
-
మేడిగడ్డ – ఒక తెగిన వీణ
ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లర్లను ఇతర పరిసరాలను మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికే ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఎదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల శవాలను తెచ్చుకునేటప్పుడు, మార్చురీ…
-
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల పత్రాలను (Nominations) స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్ 10 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 13న నామినేషన్లను…
-
శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని, శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నిమిత్తం హైకోర్టు విచారణలో భాగంగా అడ్వకేట్ కమీషన్‌ను నియమించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే…
-
తెలంగాణ బిఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు వేసిన హైకోర్టు పిటిషన్ పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది.
-
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు మళ్ళీ రద్దు – హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.