కేవలం ఒక రాత్రిలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌ను 6 గంటల కన్నా తక్కువ సమయంలో 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ సెరెండిక్స్ రాత్రి చివరి రైలు బయలుదేరే సమయం నుంచి ఉదయం మొదటి రైలు రాక వరకు హట్సుషిమా రైల్వే స్టేషన్‌ను చకచకా నిర్మించింది.

దాదాపు 530 మంది ప్రయాణీకులకు సేవలందించే ఈ స్టేషన్, గంటకు ఒకటి నుంచి 3 సార్లు రైళ్లు నడిచే ఒకే లైన్‌ను ఉపయోగిస్తుంది. వాకయామా ప్రిఫెక్చర్‌లోని 25వేల మంది జనాభా కలిగిన అరిడా నగరంలో భాగమైన సముద్రతీర పట్టణంలో ఉంది. ప్రతి 20 నుంచి 60 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి.

ఈ కొత్త రైల్వే స్టేషన్ 100 చదరపు అడుగుల కన్నా కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. గతంలోని చెక్కలతో నిర్మించిన రైల్వే స్టేషన్ కన్నా చాలా చిన్నది. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ (JR West) ప్రకారం.. సాంప్రదాయ పద్ధతిలో స్టేషన్ నిర్మించేందుకు 2 నెలల కన్నా ఎక్కువ సమయం పట్టేది. రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అయ్యేది. ఈ 3D ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు హట్సుషిమాకు నైరుతి దిశలో 500 మైళ్ల దూరంలో ఉన్న కుమామోటో ప్రిఫెక్చర్‌లోని ఒక ఫ్యాక్టరీలో స్టేషన్ భాగాలను ఫ్రింట్ చేసేందుకు JR వెస్ట్ సెరెండిక్స్‌ను నియమించింది.

ఫ్రింటింగ్, కాంక్రీటు కోసం 7 రోజులు పట్టింది. ఆ భాగాలను రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసి మార్చి 24 ఉదయం స్టేషన్ స్థలానికి పంపించారు. సాధారణంగా, ఏదైనా నిర్మాణం చాలా నెలలు పాటు జరుగుతుంది. ప్రతి రాత్రి రైళ్లు నడపవు” అని సెరెండిక్స్ సహ వ్యవస్థాపకుడు కునిహిరో హండా పేర్కొన్నారు.

మొదటి రైలు ఉదయం 5:45 గంటలకు రాకముందే కొత్త రైల్వే స్టేషన్ సిద్ధంగా ఉంచారు. ఈ రైల్వే స్టేషన్ భవనం టికెట్ మిషన్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ రీడర్లు వంటి మిషన్లు ఇంకా అవసరం. జెఆర్ వెస్ట్ ప్రకారం.. ఈ కొత్త రైల్వే స్టేషన్ భవనం జూలైలో రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *