తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోంది. పదేండ్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల కలలను
చిదిమేశాయి. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పా ల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాం గ్రెస్కు ఈ ఐదేళ్లు చాలు. 17 ఎంపీ సీట్లను గెలి పిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగనివ్వం. మా ర్పునకు మోదీ గ్యారంటీ అవసరం’ అని ప్రధాని మోదీ అన్నారు.
Leave a Reply