ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 3న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు.
దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్ లు ఏర్పాటు చేశారు.
ఇందులో మొబైల్ బూత్ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలియో వ్యాక్సిన అందించడానికి శిక్షణ కూడా ఇచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు విధిగా పోలియో బూత్ కు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు కోరుతున్నారు.
ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎన్ని పనులు ఉన్నా.. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలను దగ్గరలోని కేంద్రాలకు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించకోవాలి.
మార్చి 3న ఒక వేళ మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించకపోయినా.. మార్చి 4,5 తేదీల్లో గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బంది ఇంటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.
కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వం పోలియోను నిర్మూలించడానికి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.
దేశంలో ఏ ఒక్కరు కూడా పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పిల్లలకు పోలియో రావడం వల్ల.. అది మెదడుకు కూడా పాకుతుందని వైద్యులు హెచ్చరించారు. దీని వల్ల నరాల బలహీనత ఏర్పాడుతుందన్నారు.
పోలియో వ్యాధికి టీకా తప్ప మరోక పరిష్కరం లేదని చెబుతున్నారు. అందుకే తప్పుకుండా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కులు వేయించాలని సూచిస్తున్నారు.
Leave a Reply