తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. 563 ఉద్యోగాలతో Group-1 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC).
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చకోర పక్షుల ఎదురుచూసిన గ్రూప్-1 నోటిఫికేషన్ శుభ ఘడియలు రానే వచ్చాయి. మొత్తం రెండు మల్టీజన్లో కలిపి 563 ఉద్యోగాలతో భారీ ఎత్తున నోటిఫికేషన్ రావడం జరిగింది. డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు 115 ఉండడం, గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేదు.
నిరుద్యోగులారా ఇక పుస్తకం తెరిచే సమయం ఆసన్నమైంది. పరీక్ష రాయబోయే విద్యార్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రిలిమ్స్ పరీక్ష మే లేదా జూన్ మధ్యలో జరుపబడుతుంది. మెయిన్స్ రాత పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.
Leave a Reply