జిఎస్ఎల్వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO)
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈరోజు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్ఎల్వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
2,275 కిలోల బరువున్న ఇన్సాట్-3 డీఎస్(INSAT 3DS) జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగించిన 18.46 నిమిషాల తర్వాత ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు అందించేందుకు ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం ఉపయోగిస్తారు. ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ వాతావరణ పరిస్థితుల అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.
ప్రస్తుతం ఈ కక్షలో పనిచేస్తున్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ శాటిలైట్స్ తో కలిసి ఇన్సాట్-3డీఎస్ పనిచేస్తుంది.జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
Leave a Reply