రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!

రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్
బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పట్ల వివక్షపాతంతో కనీస అవసరాలు తీర్చకుండా మద్దతు ధర ప్రకటించకుండా ఈ ప్రభుత్వం కాలం గడుపుతూ పని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఖాతాలో ఇంతవరకు డబ్బులు పడకుండా ఉండకపోవడం దారుణమని తెలియజేశారు ఇలాంటి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అదోగమనంగా ఉందని వివరించారు. నేడు పాకాల వర్షంతో అనేక మంది రైతులకు పంట నష్టం వాటిల్లిన వారికి తగిన పరిహారం ప్రభుత్వం కల్పించాలని తెలియజేశారు. అంతేకాకుండా నేడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలన అని చెప్పి, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా
,రైతుల సమస్యలు , నిరుద్యోగు లను పట్టించుకోకుండా, చేనేత కార్మికులు కూడా పట్టించుకోకుండా కాలం గడుపుతూ ముందుకు సాగుతుంది అని తెలియజేశారు, అడ్డదారి
పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమి పట్టించుకోక, అవినీతి పాలనగ రాష్ట్ర మేలుతున్నారని తెలియజేశారు. అంతేకాకుండా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టౌన్ ఉపధ్యక్షులు ఎండి సత్తార్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబీకార్ రాజన్న, వరస కృష్ణహరి, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్నాథ్, బండి జగన్ ఒగ్గు బాల్ లింగం, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Posted

in

, ,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *